సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
అర్నబ్ తుపానుపై మూడు రోజులుగా నిరంతరం సమీక్షలు చేశాం
అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్లింది
తుపాను తీవ్రత గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాం
పరిస్థితులకు అనుగుణంగా అధికారులను సన్నద్ధం చేశాం
ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా ఇస్తూ పనిచేశాం
సేఫ్, సెక్యూరిటీ, రిహాబిటేషన్ అనుసరిస్తూ ముందుకెళ్లాం
నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
పంట, ఆస్తి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
పేదలకు అండగా ఉండి కోలుకునే విధంగా చేయూత ఇవ్వాలి
గత తుపానుల సమయంలో వేలాది మంది చనిపోయారు
ఎన్ని ప్రయత్నాలు చేసినా తుపాను ప్రభావంతో ఐదుగురు చనిపోయారు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
ఆర్టీజీఎస్ ద్వారా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశాం
మాకు వచ్చిన సమాచారం 90 శాతం వరకు కచ్చితంగా ఉంది
రాత్రి 11.15 గంటలకు అర్నబ్ తుపాను తీరాన్ని తాకింది
తుపాను ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి
ఖరీఫ్ లో 72.9 సెం.మీకు బదులు 44 సెం.మీ వర్షపాతం వల్ల 53శాతం లోటు
అర్నబ్ తుపాను కంటే ముందు 39శాతం లోటు వర్షపాతం
రెండ్రోజుల్లో 12శాతం లోటు వర్షపాతం కవర్ అయింది
విశాఖ 21.8, విజయనగరం 18.9, శ్రీకాకుళంలో 14.3 సెం.మీ వర్షపాతం -
అనకాపల్లి 14, ప.గో.జిల్లాలో 6.2, కృష్ణాలో 9.6 సెం.మీ వర్షపాతం
ముందస్తు చర్యల వల్ల ఎక్కడా ఒక్క చెరువు తెగకుండా కాపాడాం
30 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేస్తూ పనిచేశాం
రేపు సాయంత్రం వరకు కొన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి
రెండు జిల్లాలు తప్ప అన్ని గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించాం
ఎల్లుండి సాయంత్రానికి కోనసీమ, ప.గో. జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరిస్తాం
దాదాపు 15 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి
ఈ రాత్రికి రహదారులపై నేలకూలిన చెట్లను తొలగించాలి
ఇప్పటికే అన్నిచోట్ల తాగునీరు పునరుద్ధరించాం
నష్టం అంచనాకు రేపు కేంద్ర బృందాన్ని పంపాలని కోరాం
ఇళ్లలో నీళ్లు చేరిన బాధితలకు 25 కిలోల బియ్యం
జాలర్లు, చేనేతలకు 50 కిలోల బియ్యం పంపిణీ చేస్తాం
బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ
శిబిరాల్లోని బాధితులకు రూ.వెయ్యి చొప్పున రూ.3 వేల వరకు సాయం -
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సాయం
కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతింటే రూ.25 వేలు సాయం
రూ.40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.50 వేలు సాయం
రూ.40 లక్షల నుంచి రూ.కోటిన్నరలోపు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష సాయం
రూ.కోటిన్నరపైగా ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.1.5 లక్షల ఆర్థిక సాయం
- ద్విచక్రవాహనం దెబ్బతింటే రూ.3 వేలు, త్రిచక్ర వాహనానికి రూ.10 వేలు సాయం
దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.9 వేలు, వలల మరమ్మతులకు రూ.5 వేలు సాయం
వలలు ఉండి దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.25 వేల సాయం
పశువులు నష్టపోయిన వారికి రూ.50 వేలు సాయం
దెబ్బతిన్న హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం
వరికి రూ.25 వేలు, చెరకు రూ.25 వేలు, సజ్జలు రూ.15 వేలు సాయం
మినుములు రూ.15 వేలు, పెసలుకు రూ.15 వేలు సాయం
మొక్కజొన్న రూ.15 వేలు, రాగులుకు రూ.15 వేలు సాయం : సీఎం చంద్రబాబు