2027లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

2027లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో మంత్రుల కమిటీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పుష్కరాల ఏర్పాట్లతో పాటు అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పుష్కరాల నిర్వహణను కేవలం ధార్మిక కార్యక్రమంగా కాకుండా, గోదావరి పరివాహక ప్రాంత సమగ్ర అభివృద్ధికి అవకాశంగా మలచాలని సూచించారు.
ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వంటి నగరాలు పుష్కరాల అనంతరం కూడా అభివృద్ధి ఫలితాలను అందుకునేలా మెగా సిటీ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. పుష్కరాల కోసం నిర్మించే రహదారులు, ఘాట్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా మారాలని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో 212 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి నది వెంట ఆరు జిల్లాల్లో భారీ స్థాయిలో పుష్కరాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం జిల్లా గుండాల నుంచి కోనసీమలోని అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలో గోవాలంక, పశ్చిమ గోదావరిలోని నర్సాపురం వరకు పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో పాటు మరో 237 కొత్త ఘాట్లు నిర్మించి మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేయాలని అధికారులు ప్రతిపాదించారు.
ఈసారి గోదావరి పుష్కరాలకు 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత పుష్కరాల్లో ఒక్కరోజులోనే 58 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, ఈసారి ఒకే రోజులో కోటి మంది వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు సమీక్షలో వివరించారు. ఈ నేపథ్యంలో ఘాట్ల విస్తరణ, రహదారి సదుపాయాలు, టెంట్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, నర్సాపురం సహా పలు పట్టణాల్లో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో రూ.1,080 కోట్లతో 1,140 పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే రూ.211.97 కోట్ల విలువైన 132 పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
3 గంటల క్రితం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలు.
18 May 2026

సమీక్ష సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్‌తో పాటు సీఎస్ జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, దేవాదాయ, వైద్యారోగ్య, రవాణా, పర్యాటక, పురపాలక, పంచాయతీరాజ్, ఆర్థిక, జలవనరులు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
18 May 2026

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశలవారీ ప్రణాళికను ప్రకటించారు.
18 May 2026