20 ఏళ్లకే క్రైమ్ రికార్డ్... దారి దోపిడీలతో మొదలుపెట్టి... బ్లేడ్, గంజాయి గ్రూపులు కట్టి... హత్యలు-అత్యాచారాలతో చెలరేగిపోయిన కరుడుగట్టిన క్రిమినల్... కృష్ణలంక క‘సాయికృష్ణ’.

20 ఏళ్లకే క్రైమ్ రికార్డ్... దారి దోపిడీలతో మొదలుపెట్టి... బ్లేడ్, గంజాయి గ్రూపులు కట్టి... హత్యలు-అత్యాచారాలతో చెలరేగిపోయిన కరుడుగట్టిన క్రిమినల్... కృష్ణలంక క‘సాయికృష్ణ’. వీడు చేయని నేరం లేదు... తలపెట్టని ఘోరం లేదు. సాయికృష్ణ చేసిన నేరాల జాబితా చూస్తేనే అందరికీ అర్థమవతుంది... వాడెంత కసాయి అనేది. రాజీవ్ కాలనీ 1వ లైన్, నెహ్రూనగర్, కృష్ణలంక, విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ @ ఉరఫ్ సాయి - పిల్ల సాయి, తండ్రి పేరు నాగేశ్వరరావు... ఇదీ వీడి అడ్రస్... వీడి నేరాల జాబితా కూడా అంతే పెద్దది. క్రైమ్ నెం.109/2017, U/s 376(D), 366(A) IPC & Sec.6 POCSO Act, కృష్ణలంక పోలీస్ స్టేషన్... సాయి కృష్ణపై ఉన్న కేసుల్లో ఇది ఒక్కటి మాత్రమే.
పిల్ల సాయి... పిచ్చ వేషాలు
16 సంవత్సరాల వయస్సు గల మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించాడు. ఆమెను ప్రలోభపెట్టి విజయవాడలోని ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత బాధితురాలిని బెదిరించి ముత్యాలంపాడు ప్రాంతంలోని అద్దె ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ తన సహచరులతో కలిసి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు బాధిత బాలికను రక్షించారు. బాధితురాలిని ప్రలోభపెట్టి తీసుకెళ్లడం, వివిధ ప్రదేశాలకు తరలించడం, నిర్బంధంలో ఉంచి లైంగిక దాడికి పాల్పడటం..., ఇతర నిందితులచే సామూహిక అత్యాచారానికి సహకరించడం వంటి చర్యల్లో సాయికృష్ణను ప్రధాన నిందితుడిగా దర్యాప్తులో నిర్దారించారు. అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. చార్జిషీట్ దాఖలు చేశారు.
మిత్రుణ్ని మట్టిలో కలిపేశాడు
అమ్మాయిలపై అఘాయిత్యాలే కాదు... బైక్ రైడ్లతో అందరినే బెంబేలెత్తించేవాడు... గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తనకే తెలియనంతగా క్రూరత్వం సాయికృష్ణది. బర్త్ డే పార్టీకి పిలిచిన పాపానికి మత్తులో స్నేహితుణ్ని కూడా హతమర్చాడు. షాపుల్లో చోరీలు, సెల్ ఫోన్లు కొట్టేయడం, డబ్బులు తీసుకుని బెదిరించడం ఇవి సాయి కృష్ణకు రొటీన్ వ్యవహారం. సినిమాహాళ్లు, బస్టాండ్లు... ప్లేస్ ఏదైనా బైక్ దొంగతనాలకు తెగబడేవాడు. ఎక్కడ అమ్మాయి కనిపించినా సాయికృష్ణ చెలరేగిపోయేవాడు... చివరికి సాయికృష్ణ ఉన్న వీధిలోకి వెళ్లాలంటేనే మహిళలు, బాలికలు, యువతులు భయంతో వణికిపోయేవాడు. ఇదీ వాడి నేర చరిత్ర. ఇలాంటి వాడు అదృశ్యం కావడంపై రాజకీయరంగు పులుముకున్నా... వాడి నైజం తెలిసిన వాళ్లకు, వాడి బాధితులకు మాత్రం సంతోషం నింపింది.