యర్రగొండపాలెం స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎరిక్షన్ బాబు వ్యూహాలతో ఐదు జడ్పీటీసీ, ఐదు ఎంపీపీ స్థానాలు కూటమి ఖాతాలోకి వచ్చాయి.

కూలిన కంచుకోట
యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూటమి జయకేతనం
మూడు దశాబ్ధాల అనంతరం జడ్పీ, ఎంపీపీ పీఠాలపై ఎగిరిన పసుపు జెండా
30 ఏళ్ల కాంగ్రెస్, వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టిన ఎరిక్షన్ బాబు
తన పొలిటికల్ వ్యూహాలతో వైసీపీని మూడు చెరువుల నీళ్లు తాగించిన వైనం
నిత్యం మీడియా ముందు డైలాగులు కొట్టే ఎమ్మెల్యే తాటిపర్తి నోటికి తాళం
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎరిక్షన్ సక్సెస్
రెండవ పులివెందులుగా చెప్పుకునే యర్రగొండపాలెం నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ చతికలపడింది. టీడీపీ ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ దూసుకెళ్లింది. నియోజవకర్గ చరిత్రలో, మునుపెన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయ దుంధుబి మోగించింది. ఎరిక్షన్ బాబు వేసిన రాజకీయ వ్యూహాలకు యర్రగొండపాలెం నియోజవకర్గ వ్యాప్తంగా ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది మెజారిటీతో ఎమ్మెల్యే పదవికి దూరమైన ఎరిక్షన్ బాబు.. ఈ సారి తన పంథా మార్చుకుని ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని తన భుజస్కందాలపై వేసుకుని తన అనుభవంతో 30 ఏళ్ల కాంగ్రెస్, వైసీపీల ఆధిపత్యానికి గండికొట్టారు.
5 ఎంపీపీలు, 5 జడ్పీజీలు కూటమికే
నియోజవకర్గ చరిత్రలో గానీ, నియోజకవర్గం ఏర్పడకముందుగానీ టీడీపీ ఏమాత్రం స్థానిక సంస్థల్లో ఆధిక్యం చూపించిన దాఖలాలు లేవు. 2009 లో నియోజవకర్గం ఏర్పడిన తర్వాత వరుసగా అక్కడ కాంగ్రెస్, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల్లోనూ అక్కడ కొద్ది మెజారిటీతో ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ బయటపడ్డారు. అయితే ఎక్కడైతే పొగొట్టుకున్నారో...అక్కడే వెతికి సాధించుకోవాలన్న నిశ్చయంతో ఉన్నారు టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు. దీనికోసం ముందు నుంచే సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. 28 నెలల కూటమి పాలనలో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రాబట్టారు. దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని నియోజవకర్గాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్తున్నారు. రహదారులు, సీసీ రోడ్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి, గోకులాలు, రైతు రథాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తు చేపట్టి ఆకర్షణగా నిలిచారు. వీటిపై నియోజకవర్గంలోని ప్రజల్లో చర్చ బాగానే ఉంది. అన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకున్న ఎరిక్షన్ బాబు... వాటి ఫలితాలను స్థానిక ఎన్నికల్లో రాబట్టారు. నియోజకవర్గంలోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాల జడ్పీ, ఎంపీపీ పీఠాలను కూటమి ఖాతాలోకి వచ్చేలా చేశారు. రెండవ పులివెందుల అని బీరాలు పలికే వారి నోటికి తాళాలు వేయడంతో పాటు వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇదే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో రిపీట్ అయితే తమ భవితవ్యం ఏమిటన్న కలవరం వారిలో మొదలైంది. నిత్యం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్, లోకేష్‌పై విరుచుకుపడే చంద్రశేఖర్ నోటికి స్థానిక ఫలితాలతో ఎరిక్షన్ బాబు అడ్డుకట్ట వేశారు. మాటలు మనిషి కాదు... చేతల మనిషి అని ఎరిక్షన్ బాబు మరోసారి నిరూపించుకున్నారు. నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడటంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి
డిప్యూటీ సీఎం పవన్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని
యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తంగా 5 మండలాలు ఉన్నాయి. ఇందులో పుల్లలచెరువు మండల జడ్పీ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేన తరపున పోటీ చేసిన అచ్చయ్య నిరుపేద. సీటు కేటాయించిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎరిక్షన్ బాబుతో మాట్లాడి...అచ్చయ్య గెలుపునకు కృషి చేయాలని కోరారు. దీంతో ఎరిక్షన్ బాబు అంతా తానై చూసుకున్నారు. మండలంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. టీడీపీ ఓటు బ్యాంకు గాజు గ్లాసుకు మూకుమ్మడిగా మళ్లించడంలో సక్సెస్ అయ్యి... జనసేన జడ్పీటీసీ అభ్యర్ధి అచ్చయ్యను 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గెలిపించి కానుకగా ఇస్తానని పవన్‌కు ఇచ్చిన మాటను ఎరిక్షన్ బాబు నిలబెట్టుకున్నారు.