1. ప్రజలకు ప్రభుత్వ, పాలనా సేవల అంశంపై లీడర్షి్ప్ కాన్ క్లేవ్లో ప్రసంగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు
2. పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి
3. అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలి
4. ఏడాదికి రూ.1000 కోట్ల ఆదాయం వస్తున్నా వదులుకుని ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నాం.
5. ఎక్కడైనా ఉచిత ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్తే అడ్డుకోవాలి. ఏ రీచ్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిపోతోంది.
6. గత పాలనలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి నకిలీ, జే బ్రాండ్లు విక్రయించారు. దీంతో 30 వేలమంది ప్రాణాలు వదిలారు.
7. ఇప్పుడు వాటన్నిటినీ నియంత్రించి విక్రయాలను పారదర్శకంగా చేస్తున్నాం.
8. మద్యం టెండర్లు ముగిస్తోంది...అయినా ప్రస్తుతం ఎన్ని దుకాణాలు ఉన్నాయో వాటిని రెన్యువల్ చేస్తాం. అయితే ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి అదనంగా విక్రయించేందుకు వీల్లేదు
9. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటాం. నియోజకవర్గాల్లో దీనిని సెట్ రైట్ చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే
10. ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రల్ని సమర్ధంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టండి.
11. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసులను ఆన్లైన్లోనే అందిస్తున్నాం
12. పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రతా ఫీచర్లతో ఇస్తున్నాం
13. నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యల్ని సుమోటోగా తీసుకుని పరిష్కరించండి.
14. తద్వారా మీకూ బ్రాండ్ వస్తుంది. సమస్య కూడా పరిష్కారం అవుతుంది.
15. నివాసం ఉంటూ అభ్యంతరాల్లేని చోట ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్దీకరణ చేస్తాం.
16. ఓ రాజకీయ నాయకుడు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ప్రజలకు దగ్గరవ్వాలి.
17. కనీసం వాయిస్ మెసేజ్ ద్వారా ఆయినా ప్రజలకు చేరువ కావాలి.
18. ప్రజల సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే వారిలో సానూకూల దృక్పథం వచ్చే అవకాశం ఉంది.
19. ఆర్టీజీఎస్ ద్వారా పబ్లిక్ గ్రీవెన్సులను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా చూడాలి
20. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వీటి పరిష్కారం కోసం పనిచేయాలి
21. వస్తున్న ఫిర్యాదుల్లో అధికభాగం భూ వివాదాలే ఉంటున్నాయి.
22. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం
23. గడచిన 3 ఏళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రూఫ్ టాప్ సోలార్‌పై అంతా దృష్టి పెట్టాలి
24. ల్యాండ్ రికార్డులు అన్నీ 2027 మార్చినాటికి ప్రక్షాళన పూర్తి అయితే భూ వివాదాలు ముగిసిపోతాయి
25. నెలలో కనీసం నాలుగు సార్లు పేదల సేవలో కార్యక్రమంతో ప్రజల్ని కలుస్తున్నాం
26. జెన్ జీ యువత ఆలోచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి
27. రియల్ టైమ్ నిర్ణయాలతో దూకుడుగా జెన్ జీ వర్గం ఉంది.
28. ఎలాంటి ఎకానమీ ఉండాలనేది ప్రజలు నిర్ణయించుకునేలా ఆలోచనలు చేయాలి.
29. పదేళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఉంటాయో అన్న అలోచల్ని మనం కలిగి ఉండాలి
30. హెల్త్, ఎడ్యుకేషన్, లివబిలిటీ లాంటి అంశాలు జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరం
31. గత సమావేశంలో నియోజకవర్గాల్లో పరిష్కరించాల్ని అంశాలను ఎమ్మెల్యేలు లేవనెత్తారు. వీటిపై సమీక్షించి 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 పనుల్ని మంజూరు చేశాం.