ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ‘APVR-2026’ నోటిఫికేషన్ కింద నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షకు సంబంధించిన తుది జవాబు కీ, సవరించిన రెస్పాన్స్ షీట్లు, అభ్యర్థుల స్కోరు

AEE Notification final key: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ‘APVR-2026’ నోటిఫికేషన్ కింద నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షకు సంబంధించిన తుది జవాబు కీ, సవరించిన రెస్పాన్స్ షీట్లు, అభ్యర్థుల స్కోరు వివరాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు.
ఆగస్టు 23 నుంచి 27 వరకు నిర్వహించిన CBT పరీక్షకు సంబంధించిన తుది ఫలితాల వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు విద్యుత్ సౌధ మానవ వనరుల విభాగం (HRD) ముఖ్య ప్రధాన జనరల్ మేనేజర్ వెల్లడించారు.
ఈ నియామక పరీక్షను APTRANSCO, APGENCO, APSPDCL, APEPDCL, APCPDCL సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో నిర్వహించారు.
అభ్యర్థుల స్కోరు జాబితాను ఆధారంగా చేసుకుని తుది మెరిట్ జాబితా రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలు, అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక జాబితాను సిద్ధం చేయనున్నారు.
ప్రతి పోస్టుకు ఒక అభ్యర్థి చొప్పున 1:1 నిష్పత్తిలో తుది ఎంపిక జాబితాను రూపొందించి, రానున్న రెండు వారాల్లో అధికారిక పోర్టల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తుది మెరిట్ జాబితాలో చోటు దక్కించుకునే దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్దేశిత ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
వైద్య పరీక్షలకు సంబంధించిన తేదీలు, ఆసుపత్రుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సంబంధిత అభ్యర్థులు అధికారులు సూచించిన తేదీ, సమయానికి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.
మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన వేదిక, తేదీ, సమయం తదితర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను నిర్ణయించిన తేదీన తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి నిర్దేశిత విద్యార్హతలు లేదా ఇతర అర్హత ప్రమాణాలను పూర్తి చేయలేదని తేలితే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
అలాగే నకిలీ లేదా తప్పుడు వివరాలతో కూడిన ధ్రువపత్రాలను సమర్పించినా, నిర్ణీత గడువులో అవసరమైన పత్రాలను అందించకపోయినా, సర్టిఫికెట్ల పరిశీలనకు గైర్హాజరైనా ఎంపిక ప్రక్రియ నుంచి అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.
AEE నియామక ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం, మెరిట్ జాబితా, సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు, వైద్య పరీక్షలకు సంబంధించిన అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.