నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఇవ్వడం జరిగింది. దీంతో సీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత పది రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిర్వహించిన నిరసనలు, సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన ఉద్యమం మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ తొలి డిమాండ్ అని ప్రకటించిన సీజేపీ, మరో దఫా చర్చలకు ముందే ఆయన రాజీనామా చేయడంతో దీనిని విద్యార్థుల ఉద్యమానికి తొలి విజయంగా అభివర్ణించింది.
రాజీనామా అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ 'ఎక్స్'లో విడుదల చేసిన లేఖలో గత పది రోజుల పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని, దేశ యువత భవిష్యత్తు దృష్ట్యా నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నానని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ, న్యాయ వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలన్నదే తన నిర్ణయానికి ప్రధాన కారణమని వివరించారు.
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ప్రారంభం నుంచే తాను బాధ్యత స్వీకరించానని, ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రాజీనామా వార్త వెలువడగానే జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. "ఇది ఒక్క వ్యక్తి విజయం కాదు. దేశవ్యాప్తంగా పోరాడిన ప్రతి విద్యార్థి విజయం" అని సీజేపీ నాయకులు పేర్కొన్నారు. తొలి డిమాండ్ నెరవేరిందని, అయితే మిగిలిన డిమాండ్లు కూడా అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జీకి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ స్వాగతించారు. శాంతియుత ఉద్యమం, యువత పట్టుదలకు దక్కిన విజయమిదని పేర్కొంటూ విద్యార్థులను అభినందించారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ఇది తొలి అడుగని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, నిరసనల సందర్భంగా జరిగిన లాఠీచార్జీపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కేంద్ర నాయకత్వం త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందన్న ప్రచారం కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.