కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం 40 రోజుల్లో కోటి ఇళ్లను చేరిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం - 2 ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల పట్టుదల, సమన్వయంతో కేవలం 40 రోజుల్లోనే కోటి ఇళ్లను సందర్శించడం ద్వారా ‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం కీలక మైలురాయిని అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.
కోటి ఇళ్ల సందర్శన సందర్భంగా టీడీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలు తీరును కూడా తెలియజేశాయని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
పార్టీ కేడర్‌ను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న సంకల్పానికి కోటి ఇళ్ల సందర్శన మైలురాయిగా నిలిచిందని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ప్రతి రోజూ లక్షలాది కుటుంబాలను నేరుగా కలుసుకుంటూ ప్రజలతో మమేకమై, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా పార్టీ శ్రేణులు సేకరించాయని తెలిపారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువయ్యారని ఆయన పేర్కొన్నారు.
‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం కోటి ఇళ్ల మైలురాయిని చేరుకోవడంలో పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి కీలకమని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
“ఈ మైలురాయి చేరుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలదే క్రెడిట్” అని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనే కార్యక్రమం విజయానికి నిదర్శనమని అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యవేక్షణలో ‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీకి, ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను తెలుసుకోవడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని ఆయన అన్నారు.
కోటి ఇళ్ల సందర్శనతో కార్యక్రమం మరో కీలక మైలురాయిని అధిగమించిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
28 August 2026
