ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా "2 ఏళ్ల నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం" అనే నినాదంతో భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సభను ప్రారంభించారు. మంత్రి లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ విజయగర్జన సభకు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం.. "రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌లతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వేసిన అడుగును ప్రజలు దీవించారు. 57 శాతం ఓట్ షేర్‌తో 164 సీట్లు అందించి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. ఈ అఖండ తీర్పును మేం కేవలం గెలుపుగా భావించడం లేదు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాపై ఉంచిన బాధ్యతగా చూస్తున్నాం. మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. "ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన నాటి విధ్వంసం.. వ్యవస్థల నిర్వీర్యంతో ముగిసింది. ఇన్వెస్టర్లను తరిమేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టారు. నన్ను, పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టారు. ఎమ్మార్వో ఆఫీసులు, ఆస్పత్రులు, చివరకు మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన 'గొడ్డలి పార్టీ'కి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని సైతం కల్తీ చేసి అపచారం చేశారు. బ్రిటీషర్లు కూడా చేయని దుర్మార్గానికి ఒడిగట్టారు" అని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులను మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల విజయవంతమైన పాలనను కొనియాడుతూ, దేశాన్ని ఆయన పేదరికం నుండి విముక్తి వైపు నడిపిస్తున్నారని ప్రశంసించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి తమ ప్రభుత్వం ఆక్సిజన్ అందించి నిలబెట్టిందని భరోసా ఇచ్చారు.


తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.
4 గంటల క్రితం

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో మునుపెన్నడూ లేని విధంగా భారీ అక్రమాలు, లీకులు, అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
1 రోజుల క్రితం

"ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నాం. పరిశ్రమలకు వేగంగా అనుమతులిస్తూ యువతకు ఉద్యోగాలతో పాటు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
5 రోజుల క్రితం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణి చేశారు.
4 రోజుల క్రితం