వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

వైసీపీకి రాజకీయ పార్టీ లక్షణాలు లేవు
గొడ్డలి, ఫేక్ ప్రచారమే ఆ పార్టీ అస్త్రం
కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల సంపద ఆవిరైంది
మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియా పైనా ఉందన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఐఏఎస్‌లు బలి...వ్యాపారవేత్తలు నాశనం
వైసీపీకి రాజకీయ పార్టీ లక్షణాలు, ఆ పార్టీ అధినేతకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని సీఎం అన్నారు. అందుకే తాను ఆ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నానని, వైసీపీ చరిత్ర అంతా రక్త చరిత్రేనని పేర్కొన్నారు. వైసీపీ పోకడలు, వారి ప్రవృత్తిని చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని వివరించారు. జగన్ రెడ్డి, ఆయన కుటుంబం వల్ల అనేక మంది ఐఏఎస్‌లు బలయ్యారని, వ్యాపారవేత్తలను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇప్పటికీ పెట్టుబడులు పెట్టేవారిని బెదిరిస్తూ పరిశ్రమలు తరిమేస్తామని చెప్తున్నారని, పరిశ్రమలు వచ్చి ఉపాధి కల్పన జరిగితే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడుతున్నారని అన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తైందని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయన్న సీఎం... ఈ నేపథ్యంలోనే గొడ్డలి పార్టీలో టెన్షన్ మొదలైందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అరాచకాలపై సమాజంలోనూ మార్పురావాలని కోరారు. సొంత ప్రయోజనాలు, భూములు కొట్టేసే కుట్రలో భాగంగా రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు గురి చేశారని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని అన్నారు. 22ఏలో పెట్టిన కారణంగా గత ప్రభుత్వంలో రైతులు కనీసం యూరియా తెచ్చుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయిందన్నారు.
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచారు
సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్‌వుట్ చేస్తున్నామని వివరించారు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతోపాటు, మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి ఉండదన్నారు. బ్రహ్మణీ స్టీల్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకున్న అంశంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఒక వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల సంపద ఆవిరైందని వ్యాఖ్యానించిన సీఎం... స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్నారు. బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుందని, అయితే ఓబులాపురం మైనింగ్ అంశం ఇంకా ముగియలేదని అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగా భ్యాసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.
21 June 2026

ఆర్థిక సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
15 June 2026
హిట్... రన్...ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజం
వైసీపీ అధినేత జగన్ నైజాన్నీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. హిట్, రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ నైజమని, ఇక్కడ ఏదో ఒకటి చేయించడం, వెళ్లి పక్కరాష్ట్రంలోని బెంగళూరులో ఉండటం అలవాటైందన్నారు. ‘‘ప్రభుత్వాన్ని, పార్టీ నేతల్ని టార్గెట్ చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సైకో మనస్తత్వంతోనే తెలంగాణలో ఆరుగురు హత్యకు గురయ్యారు. పొక్సో కేసు పెట్టారని బాధితురాలు, వారి కుటుంబాన్ని, కోపరేట్ చేయలేదని సొంత కుటుంబాన్ని హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి, సొంత చెల్లి వ్యవహారాల్లో జగన్ వైఖరి ఏంటో అంతా చూశాం. గొడ్డలి పార్టీ అధినేతకు, తెలంగాణలోని హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయి.
27 June 2026


ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.
12 June 2026