బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి.

Gold and Silver rates today: పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు మంగళవారం (నవంబరు 17) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, రూపాయి మారకం విలువలో మార్పులు వంటి అంశాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరల్లో కదలికలు కనిపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారంపై రూ.800కు పైగా తగ్గుదల నమోదైంది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి కొంత ఊరట కలిగింది.
మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయి? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధరలు ఎంత పలుకుతున్నాయి? తెలుసుకుందాం.
నవంబరు 17న నమోదైన మార్కెట్ ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,39,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,27,300 స్థాయిలో కొనసాగుతోంది. గత ముగింపుతో పోలిస్తే అంతర్జాతీయ బులియన్ మార్కెట్ ఆధారిత సూచీ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.877 తగ్గింది. వెండి ధర మాత్రం కిలోకు సుమారు రూ.53 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో నవంబరు 17న బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో నమోదయ్యాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,335గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,39,012గా ఉంది. విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.1,27,321, 24 క్యారెట్ల ధర రూ.1,38,997గా నమోదైంది.
నెల్లూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,340 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,39,017గా ఉంది. తిరుపతిలో ఈ ధరలు వరుసగా రూ.1,27,330, రూ.1,39,007గా నమోదయ్యాయి. కర్నూలులోనూ 22 క్యారెట్ల ధర రూ.1,27,340, 24 క్యారెట్ల ధర రూ.1,39,017గా కొనసాగింది. శ్రీకాకుళం, ఏలూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,335 కాగా, 24 క్యారెట్ల ధర రూ.1,39,012గా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,378గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.1,39,059గా నమోదైంది.
నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,27,378, 24 క్యారెట్ల బంగారం రూ.1,39,059గా ఉంది.
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కిలో వెండి ధర సుమారు రూ.1,75,700 కాగా, తెలంగాణలో రూ.1,75,900 స్థాయిలో ఉంది. నగరాన్ని బట్టి స్థానిక మార్కెట్ ధరల్లో మార్పులు ఉండవచ్చు.
బులియన్ మార్కెట్లో ప్రకటించే ధరలు, నగల దుకాణాల్లో వినియోగదారులు చెల్లించే తుది ధరలు ఒకేలా ఉండవు. ఆభరణాల తయారీ ఛార్జీలు, తరుగు, వృథా ఛార్జీలు, జీఎస్టీ అదనంగా వర్తిస్తాయి. బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్, హెచ్‌యూఐడీ వివరాలు పరిశీలించడంతో పాటు రెండు మూడు దుకాణాల్లో ధరలను పోల్చి చూడటం మంచిది.
పసిడి ధరలు రోజులోనూ మారే అవకాశం ఉండటంతో కొనుగోలుకు వెళ్లే ముందు స్థానిక జువెలరీ షోరూమ్‌లో తాజా ధరను నిర్ధారించుకోవాలి.